కిడ్నీలు మన శరీరంలో ఉన్న వ్యర్ధ పదార్థాలను బయటకి పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే ఈ పని సక్రమంగా జరుగుతుంది.
లేదంటే మన శరీరంలో మలినాలు, వ్యర్ధ పదార్థాలు పెరిగిపోయి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.కానీ ప్రస్తుతం చాలా మంది కిడ్నీ రోగాలతో బాధపడుతున్నారు.
మూత్ర పిండాల ఆరోగ్యం దెబ్బ తినడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే అది ఇతర అవయవాల పని తీరుపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.
మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించడానికి కొన్ని రకాల పౌష్టికాహారాలు కీలక పాత్ర పోషిస్తాయి.మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారపదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలీఫ్లవర్ మన మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తుంది.

కాలీఫ్లవర్ యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం.దీనిలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి.వీటిని తింటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే బ్లూబెర్రీ లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.స్ట్రాబెర్రీలు,బ్లూబెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
వీటిలో విటమిన్ సి తో పాటు ఫైబర్ వంటి ఎన్నో పోషకలు ఉంటాయి.వీటిని తింటే మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు కిడ్నీ వ్యాధులు కూడా దూరం అవుతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే క్యాబేజీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.దీనిలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి.క్యాబేజీని తింటే గుండె సంబంధిత సమస్యలు, మూత్ర పిండాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.ఇంకా చెప్పాలంటే రెడ్ క్యాప్సికంలో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది.ఈ కూరగాయ మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది.రెడ్ క్యాప్సికం లో విటమిన్ సి బివిటమిన్ బి6, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.







