తెలుగు దేశం పార్టీ ప్రచార కార్యక్రమాలలో హీరో నిఖిల్.. ఫోటోలు వైరల్!

త్వరలోనే ఏపీలో ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలకు కూడా రాజకీయ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

 Hero Nikhil Siddharth Campaign For Tdp, Nikhil, Election Campaign, Tdp Party, Ap-TeluguStop.com

మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.అయితే తాజాగా హీరో నిఖిల్ ( Hero Nikhil )సైతం కూటమికి మద్దతుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

Telugu Ap, Chandrababu, Nikhilsiddharth, Kondaiah, Lokesh, Nikhil, Tdp-Movie

కొండ‌య్య గురువారం చీరాల ( Chirala ).అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు.అంత‌కుముందు ఆయ‌న చీరాల మండ‌ల ప‌రిధిలోని హస్తినాపురంలోని గ‌ణేశుడి ఆల‌యం నుంచి చీరాల వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించ‌డం జ‌రిగింది.ఈ ర్యాలీలో భాగంగా సినీ నటుడు నిఖిల్ పాల్గొన్నారు.

సందర్భంగా గడియార స్తంభం కూడలిలో నిఖిల్‌ మాట్లాడుతూ.చిరు నవ్వుల చీరాల కావాలంటే కొండయ్యకు( Kondaiah ) ఓటు వేసి గెలిపించాలని కోరారు.

అయితే ఈ పార్టీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా నిఖిల్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనతో ఫోటోలు దిగడం కోసం ఎగబడ్డారు.

Telugu Ap, Chandrababu, Nikhilsiddharth, Kondaiah, Lokesh, Nikhil, Tdp-Movie

ఇలా నిఖిల్ గతంలో తెలుగుదేశం పార్టీ( TDP )లోకి చేరారు అంటూ కూడా వార్తలు రాగా నిఖిల్ ఆ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.అయితే నిఖిల్ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.అయితే ఈయన పార్టీ తరపున కాకుండా తన బంధువులు కావడంతోనే ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.

నిఖిల్ సోదరిని మాలకొండయ్య యాదవ్ ( Mala Kondaiah Yadav ) పెద్ద కుమారుడు అమర్‌నాథ్‌కు ఇచ్చి వివాహం చేశారు.అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధుత్వం ఉంది.

ఈ బంధుత్వం చూడు కారణంగానే నిఖిల్ ఎన్నికల ప్రచార ( Election Campaign ) కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube