మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానన్న ఆయన రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో హరీశ్ రావు రిజైన్ లెటర్ ను రెడీగా పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.ఆగస్ట్ 15వ తేదీలోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ ( Rythu Runa Mafi )చేసి తీరుతామని తెలిపారు.అయితే గత కొన్ని రోజులుగా హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా గన్ పార్క్( Gun Park ) వద్దకు వెళ్లిన హరీశ్ రావు తన రాజీనామా లేఖను జర్నలిస్టులకు అందజేశారు.రైతు రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఆగస్ట్ 15 లోపు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానన్నారు.
అదేవిధంగా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని హరీశ్ రావు చెప్పారు.ఒకవేళ హామీలను అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు.