ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.54
సూర్యాస్తమయం: సాయంత్రం.6.36
రాహుకాలం: ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు: మ.1.20 ల2.00
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ12.28 ల1.12
మేషం:
ఈరోజు దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు.వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి.స్వల్ప ధన లాభ సూచనలున్నవి.
వృషభం:
ఈరోజు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
మిథునం:
ఈరోజు వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు.నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.
కర్కాటకం:
ఈరోజు వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి.ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి.ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి.
మొండి బకాయిలు వసూలవుతాయి.బంధు మిత్రుల ఆదరణ పొందుతారు.ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
సింహం:
ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు.బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది.
భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి.ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.
కన్య:
ఈరోజు ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి.వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.వాహన సంభందిత వ్యాపారాలు లాభాలుబాట పడతాయి.స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు.ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
తుల:
ఈరోజు ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి.ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.ఆర్థిక లాభాలు అందుతాయి.
వృశ్చికం:
ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు.ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి.
ధనుస్సు:
ఈరోజు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.
చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు.నూతన వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలుంటాయి.ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
మకరం:
ఈరోజు దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.
గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగమున పురోగతి కలుగుతుంది.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కుంభం:
ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి.సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి.
దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు.ఉద్యోగమున విధులు సమర్ధవంతంగా నిర్వహించి.అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
కుంభం:
ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు.ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి.
వ్యాపార మందకొడిగా సాగుతాయి.