ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి ఒప్పో K12 స్మార్ట్ ఫోన్( Oppo K12 Smartphone ) త్వరలోనే భారత మార్కెట్ లో విడుదల కాబోతోంది.ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలతో పాటు ధర వివరాలను తెలుసుకుందాం.ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే తో వస్తోంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 3 SoC( Octa Core Qualcomm Snapdragon 7 ) ద్వారా అడ్రినో 720 GPU తో వస్తోంది.ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ OS 14 పై పని చేస్తుంది.
ఈ ఫోన్ 5500mAh బ్యాటరీ సామర్థ్యం తో సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ను కలిగి ఉంటుంది.ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఉంటుంది.ఈ ఫోన్ డ్యూయల్ రియల్ కెమెరాలను కలిగి ఉంది.
![Telugu Oppo, Oppo Smartphone, Oppo Storage, Smartphone-Technology Telugu Telugu Oppo, Oppo Smartphone, Oppo Storage, Smartphone-Technology Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/Oppo-K12-Smartphone-Specifications-Details.jpg)
ఈ ఫోన్ స్టోరేజ్( Oppo K12 Storage ) విషయానికి వస్తే.12GB వరకు LPDDR 4ఎక్స్ RAM, 512 GB వరకు UFS 3.1 ఆన్ బోర్డ్ స్టోరేజ్ తో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్ లలో అందుబాటులో ఉంది.8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20700 గా ఉండే అవకాశం ఉంది.12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23900 గా ఉండే అవకాశం ఉంది.12GB RAM+512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28700 గా ఉండే అవకాశం ఉంది.
![Telugu Oppo, Oppo Smartphone, Oppo Storage, Smartphone-Technology Telugu Telugu Oppo, Oppo Smartphone, Oppo Storage, Smartphone-Technology Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/Oppo-K12-Smartphone-Specifications-Features.jpg)
ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 29న లాంచ్ కానుంది.ఈ ఫోన్ బరువు కేవలం 186 గ్రాములు మాత్రమే.మిడ్ రేంజ్ బడ్జెట్లో అద్భుతమైన ఫీచర్లు ఉండే స్మార్ట్ ఫోన్ గా మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.