హెయిర్ ఫాల్.దాదాపు అందర్నీ వేధించే కామన్ సమస్య ఇది.
అయితే కొందరిలో ఇది కాస్త తీవ్రతరంగా ఉంటుంది.దాంతో ఈ సమస్య నుంచి బయట పడటం కోసం కొందరు మందులు కూడా వాడుతుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ మ్యాజికల్ ఆయిల్ కనుక వాడితే మీ జుట్టు రాలమన్నా రాలదు.సహజంగానే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.మరి ఇంతకీ ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ పెటల్స్ వేసుకోవాలి.అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి, వన్ టేబుల్ స్పూన్ ఉసిరి కాయ పొడి, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ పొడి వేసుకోవాలి.
వీటితో పాటు ఐదు నుంచి ఎనిమిది మందారం పువ్వు రేకలు, కొద్దిగా వట్టి వేరు వేసుకోవాలి.చివరిగా ఒక కప్పు కొబ్బరి నూనె, అర కప్పు బాదం నూనె వేసుకుని అన్ని కలిసేలా మిక్స్ చేసి మూత పెట్టి మూడు నుంచి నాలుగు రోజుల పాటు వదిలేయాలి.
అనంతరం ఆయిల్ ను పల్చటి వస్త్రం సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.ఈ మ్యాజికల్ ఆయిల్ హెయిర్ ఫాల్ ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను తలకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకుని పడుకోవాలి.మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూను యూస్ చేసి తల స్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఇలా చేస్తే హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అవుతుంది.అలాగే జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.అంతేకాదు, ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా సైతం పెరుగుతుంది.