పిఠాపురంలో యూ.ఎస్.ఏ, ఎన్.ఆర్.ఐ సేవలు అభినందనీయం అంటూ నాగబాబు కామెంట్స్..!!

2024 ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.కూటమిగా మూడు పార్టీలు ఏర్పడటానికి పెద్ద పాత్ర పోషించారు.

 Nagababu Comments Saying Usa And Nri Services In Pithapuram Are Commendable Deta-TeluguStop.com

ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా.బీజేపీ, టీడీపీ పార్టీలు కలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

ఎట్టి పరిస్థితులలో రెండోసారి జగన్( Jagan ) ముఖ్యమంత్రి కాకూడదని పవన్ కళ్యాణ్.కంకణం కట్టుకుని మరి ఎన్నికలలో వ్యవహరించారు.

ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం( Pithapuram ) నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం తెలిసిందే.దీంతో కచ్చితంగా పవన్ గెలవాలని చాలామంది సెలబ్రిటీలు, సినీ నటులు.

ప్రచారం నిర్వహించడం జరిగింది.విదేశాల నుండి వచ్చి కూడా పవన్ గెలుపు కోసం కృషి చేశారు.

దీంతో వారందరికీ సోషల్ మీడియాలో నాగబాబు( Nagababu ) కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ పెట్టడం జరిగింది.

“పిఠాపురం నియోజకవర్గంలో ఎన్.ఆర్.ఐ.శ్రీ స్వామి అనిశెట్టి ఆధ్వర్యంలో యూ.ఎస్.ఏ.ఎన్.ఆర్.ఐ.జన సైనికులు అందించిన సేవలు అభినందనీయం.పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ప్రక్రియ మొదలు పెట్టిన దగ్గర నుంచి పోలింగ్ ముగిసే వరకు యూ.ఎస్.ఏ.ఎన్.ఆర్.ఐ.జన సైనికులు స్వచ్చందంగా సహకారం అందజేశారు.ముఖ్యంగా ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు చేదోడువాదోడుగా ఉన్నారు.ఎన్నికల ప్రక్రియలో ముఖ్య విభాగాలకు అండగా నిలిచి అమూల్యమైన సేవలు అందించారు.

జనసేన పార్టీ( Janasena Party ) కార్యక్రమాలకు చాలా కాలంగా సహకరిస్తున్న యూ.ఎస్.ఏ.ఎన్.ఆర్.ఐ.టీం శ్రీ స్వామి అనిశెట్టి నాయకత్వంలో శ్రీ అనిల్ అనసూరు, శ్రీ సప్త గిరీష్ ఇండుగుల, శ్రీ బాల బీరం, శ్రీ శ్రీనివాస్ గంజి, శ్రీ ఓం నక్క, శ్రీ సాయి నండూరి, శ్రీ శశాంక్, పిఠాపురంలో యూ.ఎస్.ఏ.ఎన్.ఆర్.ఐ.టీంకు సహకరించిన శ్రీ చిక్కాల సుబ్రమణ్యం, శ్రీ చోడిశెట్టి వాసు, శ్రీ మాదిరెడ్డి మధు, శ్రీ గాజుల భార్గవ్, శ్రీ చిక్కాల సీతారాం, శ్రీ వాసిరెడ్డి మణి, శ్రీ ఎం.జి.రమేష్ తదితరులకు ప్రత్యేక అభినందనలు”.అని పోస్ట్ పెట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube