ప్రస్తుతం రామ్ చరణ్( Ram Charan ) వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.ఇక ఇప్పటికీ గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో రిలీజ్ కి రెడీ అవుతుండగా, ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో మరో సినిమా కూడా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకొని సెట్స్ మీదకి వెళ్ళడానికి రెడీగా ఉంది.అయితే గేమ్ చేంజర్ సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఆ సినిమా కోసం డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పటికే సినిమా కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశ్యం తో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో బుచ్చిబాబు ఈ సినిమాని ఎలా తీస్తాడు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది.ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ( Janhvi Kapoor ) మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ను తీసుకున్నారు.
ఇక ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఒక కీలకమైన పాత్రలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అయిన అమితాబచ్చన్( Amitabh Bachchan ) కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ఇంకా రివిల్ చేయడం లేదు.కానీ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అమితాబచ్చన్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే అమితాబ్ కల్కి సినిమాలో కూడా ఒక కీలక మైన పాత్రలో నటిస్తున్నాడు.కాబట్టి ఈ సినిమాలో కూడా ఆయన్ని భాగం చేసి తన ద్వారా సినిమా మార్కెట్ ను కూడా ఇంకా భారీగా పెంచాలనే ఉద్దేశ్యంలో బుచ్చిబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది…
.