ఇక ఈరోజు హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్ ‘( Double Ismart Movie ) సినిమా నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు.అయితే ఈ టీజర్ ను చూసిన ప్రేక్షకులు కొందరు చాలా బాగుంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నప్పటికీ, టీజర్ మాత్రం చాలా రొటీన్ గా ఉందని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయలను తెలియజేస్తున్నారు.
నిజానికి పూరి జగన్నాథ్( Puri Jagannadh ) సినిమాలు ఇంతకుముందు ఎలాగైతే ఉంటాయో అలాంటి ఫ్లేవర్ లోనే ఈ సినిమా కూడా నడవబోతుంది అనే ఒక హింటైతే ఈ టీజర్ ద్వారా మనకు ఇచ్చారు.
అయితే ఇప్పటివరకు ఇలాంటి సినిమాలనే చేస్తూ పోతున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు కూడా అలాంటి సినిమాలనే చేయడం ఒకంతుకు బాధాకరమైన విషయమనే చెప్పాలి.ఇక కొత్తదనాన్ని ఆశిస్తున్న ఆయన అభిమానులు కొంతవరకు నిరాశ చెందుతున్నారనే చెప్పాలి.ఇంకా ఇస్మార్ట్ శంకర్( Ismart Shankar ) ఎలాంటి జానర్ లో అయితే నడిచిందో ఈ సినిమా కూడా అలాంటి జానర్ కే స్టిక్ అయి ఎంటర్టైన్ చేస్తుందని సినిమా యూనిట్ అయితే చెబుతున్నారు.
ఇక పూరి జగన్నాథ్ మేకింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది.కాబట్టి ఆయన మేకింగ్ లో కనక ఈ సినిమా వెళ్లినట్టు అయితే సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉంటుంది.మరి మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అయితే గానీ ఇది పూరి జగన్నాథ్ ఫ్లేవర్ లో ఉందా లేదా అనేది మనం క్లారిటీగా చెప్పొచ్చు.ఇక రామ్ మాత్రం ఈ సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఆయన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయి పాన్ ఇండియాలో అతన్ని స్టార్ హీరోని చేస్తుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది…
.