ప్రధాని నరేంద్ర మోడీ .( PM Narendra Modi ) సిక్కులతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారని అన్నారు ఇండో అమెరికన్ సిక్కు నేత జస్దీప్ సింగ్ జస్సీ .
( Jasdeep Singh Jassee ) భారతదేశంలో జరుగుతున్న స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన సాధారణ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ చైతన్యాన్ని, బలాన్ని చూపుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.భారతదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రశ్నిస్తూ పాశ్చాత్య మీడియాలోని ఒక విభాగం చేసిన రిపోర్టింగ్‌పై జస్దీప్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ కథనం సత్యానికి దూరంగా వుందని ఆయన అన్నారు.
అమెరికాలో ఏం జరుగుతుందో చూడండి.
డొనాల్డ్ ట్రంప్‌ను( Donald Trump ) కోర్టుకు లాగుతున్నారని , అతనిని ప్రచారంలో మాట్లాడటానికి కూడా అనుమతించడం లేదని జస్దీప్ అన్నారు.దానితో పోలిస్తే భారతదేశం( India ) శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని కలిగి , సమర్ధవంతంగా పనిచేస్తోందని తెలిపారు.
స్వేచ్ఛా, నిష్పాక్షికమైన ఎన్నికలను నిర్వహించడంలో భారత్ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచిందని జస్దీప్ తెలిపారు.అమెరికాలో భారత మాజీ రాయబారిగా పనిచేసిన తరంజిత్ సింగ్ సంధు ( Taranjit Singh Sandhu ) ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అమృత్‌సర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు.
ఆయనకు మద్ధతుగా జస్దీప్ సింగ్ ఈ నెలాఖరులో భారత్‌ను సందర్శించాల్సి వుంది.

ప్రధాని నరేంద్ర మోడీకి మద్ధతుగా జాతీయ స్థాయిలో మూడ్ మారుతోందని జస్దీప్ తెలిపారు.గడిచిన 10 ఏళ్లలో ఆయన నాయకత్వంలో భారతదేశం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని జస్దీప్ ప్రశంసించారు.మోడీ ట్రాక్ రికార్డ్, అభివృద్ధి, దార్శనికత కారణంగా ఆయన వరుసగా మూడోసారి గెలుస్తారని జెస్సీ జోస్యం చెప్పారు.
పంజాబీ ప్రవాస సంఘం.తరంజిత్ సింగ్ అభ్యర్ధిత్వం పట్ల ఉత్సాహంగా వుందన్నారు.
రాబోయే రోజుల్లో అమృత్‌సర్‌ను( Amritsar ) ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని జస్దీప్ సింగ్ తెలిపారు.

ప్రపంచంలోని సాంస్కృతిక, మతపరమైన, ఆర్ధిక అభివృద్ధికి కేంద్రంగా అమృత్‌సర్‌కు అవకాశం వుందన్నారు.ఇప్పటి వరకు గెలిచిన ప్రజాప్రతినిధులు నగరాన్ని నిర్లక్ష్యం చేశారని.సంధు రాకతో అమృత్‌సర్ స్వర్ణ యుగాన్ని చూస్తుందని పంజాబీ అమెరికన్ కమ్యూనిటీ విశ్వసిస్తుందని ఆయన తెలిపారు.
భారతీయ అమెరికన్ గ్రూప్ ఇప్పటికే అమృత్‌సర్ కోసం 100 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిందని .ఇది ఇంకా ఆరంభం మాత్రమేనని జస్దీప్ అన్నారు.