తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు.. కూతురు అగ్నివీర్.. శ్వేతా పండిట్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

దేశంలో ఎంతోమంది లక్ష్యాలను సాధించడానికి పేదరికం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అయితే పేదరికం వల్ల ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి లక్ష్యాలను సాధించి శ్వేతా పండిట్ లాంటి వాళ్లు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.

 Agniveer Shweta Pandit Inspirational Success Story Details, Agniveer Shweta Pand-TeluguStop.com

మహారాష్ట్ర( Maharashtra ) రాష్ట్రానికి చెందిన 20 సంవత్సరాల వయస్సు ఉన్న శ్వేతా పండిట్( Shweta Pandit ) అగ్నివీర్ కు ఎంపికై వార్తల్లో నిలవడంతో పాటు ప్రశంసలు అందుకుంటున్నారు.

అగ్నివీర్ కు( Agniveer ) ఎంపిక కావడం ద్వారా ఇండియన్ నేవీకి ఎంపిక కావాలనే తన కలను ఆమె సాకారం చేసుకున్నారనే చెప్పాలి.

హడప్సర్ లోని సాధన గర్ల్స్ హైస్కూల్ లో చదువుకున్న శ్వేత తల్లి కష్టాలను చూసి తాను ఉన్నత స్థాయికి చేరాలని భావించారు.శ్వేత తల్లి జ్యోతి వానౌరీలో పారిశుద్ద్య కార్మికురాలిగా పని చేస్తున్నారు.

శ్వేత తల్లి ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేవారు.అయితే తన కూతురు మాత్రం మంచి స్థితిలో ఉండాలని ఆమె భావించేవారు.

Telugu Agniveer, Agniveershweta, Ins Chilka, Maharashtra, Mother, Poor, Poverty,

మరాఠీ నుంచి ఇంగ్లీష్ మీడియంకు మారి చదువుకున్న శ్వేత ఇంటర్ 78 శాతం మార్కులతో పాస్ అయ్యారు.అగ్నివీర్ పరీక్షకు శ్వేత సన్నద్ధమయ్యే సమయంలో ఆమెకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.ఫిట్ నెస్ కోసం శ్వేత తెల్లవారుజామున వాకింగ్, వ్యాయామాలు చేసేవారని తెలుస్తోంది.అగ్నివీర్ కు ఎంపిక కావడంతో ఆమె కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని చెప్పవచ్చు.

Telugu Agniveer, Agniveershweta, Ins Chilka, Maharashtra, Mother, Poor, Poverty,

ప్రస్తుతం శ్వేత ఐ.ఎన్.ఎస్ చిల్కాలో( INS Chilka ) శిక్షణ తీసుకుంటున్నారు.ట్రైనింగ్ యూనిట్ కు వెళ్లే సమయంలో స్టేషనరీ కొనడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు.

చివరకు శ్వేత ట్రైన్ టికెట్ ను కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే ఒక సంస్థ చేసిన సహాయం వల్ల శ్వేత ఆ ఇబ్బందులను అధిగమించారు.

రోజుకు 10 గంటలు చదువుకుని శ్వేత తన లక్ష్యాలను సాధించారని భోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube