స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) సత్యభామ మూవీ( Satyabhama Movie ) ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోలతో జత కట్టిన సంగతి తెలిసిందే.
బన్నీ కాజల్, ఎన్టీఆర్ కాజల్ కాంబినేషన్ లకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.బన్నీ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసిందని కాజల్ అగర్వాల్ వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్( Allu Arjun ) నాకు విలువైన సలహాను ఇచ్చారని ఆ సలహాను నేను ఇప్పటికీ పాటిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.కెమెరా ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంత సమయం పాటు అదే ఎమోషన్ లో ఉండాలని బన్నీ సూచనలు చేశారని కాజల్ అగర్వాల్ అన్నారు.
ఎడిటింగ్ సమయంలో అది ఉపయోగపడుతుందని బన్నీ చెప్పారని ఆమె పేర్కొన్నారు.బన్నీ చెప్పిన ఆ సలహా నా కెరీర్ కు ఎంతో ప్లస్ అయిందని ఆమె వెల్లడించారు.

అర్య2,( Arya 2 ) ఎవడు( Yevadu ) సినిమాలలో బన్నీ, కాజల్ అగర్వాల్ కలిసి నటించగా ఈ సినిమాలలో ఆర్య2 యావరేజ్ గా నిలిస్తే ఎవడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.బన్నీ కాజల్ కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కాజల్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగా ఉందనే సంగతి తెలిసిందే.

బన్నీ, కాజల్ కాంబినేషన్ రిపీట్ కావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బన్నీ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.బన్నీ పుష్ప2( Pushpa 2 ) సినిమాకు హిందీలో సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది.
కాజల్ చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.