అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (99)( Jimmy Carter ) ఆరోగ్యంపై ఆయన మనవడు జాసన్ కార్టర్ ( Jason Carter ) ఆందోళన వ్యక్తం చేశారు.రోసలిన్ కార్టర్ జార్జియా మెంటల్ హెల్త్ 28వ ఫోరంకు( Georgia Mental Health 28th Forum ) హాజరైన జాసన్ మాట్లాడుతూ.
ఇటీవలే తాను తన తాత జిమ్మీ కార్టర్‌ను కలిసినట్లుగా న్యూయార్క్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది.కార్టర్ సెంటర్‌కు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ప్రెసిడెంట్‌గా జాసన్ వ్యవహరిస్తున్నారు.
తన వ్యక్తిగత జీవితంతో పాటు గ్రాండ్ పేరెంట్స్‌పై తాను దృష్టి సారించినట్లుగా తెలిపారు.

ప్రస్తుతానికి జిమ్మీ బాగానే ఉన్నప్పటికీ.అతని జీవిత ప్రయాణం ముగిసే సమయం దగ్గర పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.మా తాత బాగానే ఉన్నారని, గడిచిన ఏడాదిన్నరగా ఆయన సంరక్షణ శాలలో ఉంటున్నారని జాసన్ చెప్పారు.
జిమ్మీ కార్టర్ ఇప్పటికే మెటాస్టాటిక్ బ్రెయిన్, లివర్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు.అయితే జాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.గతేడాది నవంబర్లోనూ తన తాత జీవితం ముగియనుంది అంటూ చెప్పారు.జిమ్మీ కార్టర్ శారీరకంగా ఎంతో క్షీణించారని జాసన్ తెలిపారు.

కాగా.గతేడాది నవంబర్‌లో జిమ్మీ కార్టర్ సతీమణి, మాజీ అమెరికా ప్రథమ మహిళ రోసలిన్ కార్టర్ (96)( Rosalynn Carter ) కన్నుమూశారు.ఆమె అంత్యక్రియలకు అమెరికా మాజీ అధ్యక్షులు, మాజీ ప్రథమ మహిళలు హాజరయ్యారు.జార్జియాలోని అట్లాంటాలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుతం జీవించి వున్న ఐదుగురు మాజీ ప్రథమ మహిళలు మెలానియా ట్రంప్, మిచెల్ ఒబామా, జిల్ బైడెన్ , లారా బుష్, హిల్లరి క్లింటన్లు హాజరై ఆమెకు నివాళులర్పించారు.అధ్యక్షుడు జో బైడెన్ , మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆమె భర్త డగ్ ఎంహాఫ్ కూడా రోసలిన్కు శ్రద్ధాంజలి ఘటించారు.2018లో జార్జ్హెచ్ డబ్ల్యూ బుష్ అంత్యక్రియలు జరిగిన తర్వాత మాజీ ప్రథమ మహిళలంతా వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి.జిమ్మీకార్టర్ నేషనల్ హిస్టారికల్ పార్క్‌లో భాగమైన కార్టర్ హోమ్ అండ్ గార్డెన్లో ఆమెను ఖననం చేశారు.1977-81 మధ్య జిమ్మి కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా సేవలందించారు.