సూర్యాపేట జిల్లా:జమాతే ఇస్లామీ హింద్ సేవలు ప్రశంసనియమని సంస్థ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు షేక్ మజీద్ అన్నారు.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ జమాతే ఇస్లామీ హింద్ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు,కొంత నగదు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద మహిళలకు,యువతులకు ఉచితంగా కుట్టుమిషన్ల శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆర్ధిక పురోగతికి దోహదం చేస్తాయన్నారు.ఎవరైతే తోటి మానవుల పట్ల దయతో ఉంటారో వారిని అల్లా కరుణిస్తాడని అన్నారు.
ప్రజలకు మేలు చేసే ఏ కార్యం అయినా గొప్పదేనని జమాతే ఇస్లామీ హింద్ సేవలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.