విద్యతోనే జీవితాలకు వెలుగు:మంత్రి

సూర్యాపేట జిల్లా:విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించే విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.బుధవారం పెన్ పహాడ్ మండల కేంద్రంలో రూ.4.50కోట్ల వ్యయంతో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా,సకల హంగులతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ నూతన భవనాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రెసిడెన్షియల్‌ స్కూల్స్ ఏర్పాటు చేసి,పేద, మధ్యతరగతి విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు.రాష్ట్రం ఏర్పడక ముందు 4వందల గురుకులాలు మాత్రమే ఉండేవని, రాష్ట్రం ఏర్పడిన తరువాత 1150 జూనియర్‌ కళాశాలలను రెసిడెన్షియల్‌ కళాశాలలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

 Education Is The Light Of Life: Minister-TeluguStop.com

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి వరకు ఉన్న కస్తూర్బా పాఠశాలలను 270 జూనియర్‌ కళాశాలలను అప్‌గ్రేడ్‌ చేశామన్నారు.విద్యపై సిఎం కేసీఆర్ దార్శనికత,ప్రత్యేక చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తుండటం వలన ఈ కళాశాలలు, పాఠశాలల్లో సీట్లకోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కడుతున్నారన్నారు.

ఇటీవల పీజీ ఎంట్రన్స్ లో సగానికి పైగా సీట్లు ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్ధులు సాధించడం శుభ పరిణామమన్నారు.రెసిడెన్షియల్ పాఠశాలలలో సీట్ల కోసం మెరిట్ మాత్రమే ప్రాతిపాదికని,ఎటువంటి ఫైరవీలకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు.

పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించడం ద్వారా మంచి విద్యను,నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యార్థులు అందించే గిఫ్ట్ అని మంత్రి అన్నారు.పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చనడానికి డా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితమే ఉదాహరణ అని,అయనను స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు తమ జీవితాలలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి కోరారు.

ఈ మధ్య కాలంలో కొంతమంది బాధ్యత లేని ఐఎఎస్ ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.వారి అసత్యపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి ఎద్దేవాచేశారు.

ఈ సందర్బంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కతిక ప్రదర్శనలను ఆసాంతం మంత్రి వీక్షించి వారితో సరదాగా గడిపారు.అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి విద్యార్థులకు,ఉపాధ్యాయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,జడ్పీ చైర్మన్ గూజ్జా దీపికా,పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది భిక్షం,జడ్పీటిసి మామిడి అనిత అంజయ్య,మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్,సింగిల్ విండో చైర్మన్ లు వెన్న సీతారామ్ రెడ్డి,నాతాల జానికి రామ్ రెడ్డి,సర్పంచ్ ఎంపిటిసిలు,టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గోన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube