అందరి వాడు అంబేద్కర్

సూర్యాపేట జిల్లా:అణగారిన వర్గాల సామాజిక,ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు అంబేద్కర్.అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం అనేది మన అదృష్టంతో పాటు అది ఆయన గొప్పతనం.

 Everyone Is Ambedkar-TeluguStop.com

దళితుల సాధికారత కోసమే దళిత బంధు.బాబా సాహెబ్ ఆశయాలను అమలు చేస్తున్న కేసిఆర్ నిజమైన అంబేద్కర్ వాది.

అంబేద్కర్ తరువాత దేశంలో దళితుల గురించి ఆలోచించిన నేత సీఎం కేసీఆర్ మాత్రమే.అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కేసీఆర్ పాలన-మంత్రి జగదీష్ రెడ్డి.

బాబా సాహెబ్ ఆశయాలకు వ్యతిరేకంగా కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చులేపడానికి వస్తున్న వారి పట్ల తస్మాత్ జాగ్రత అని,70 ఏళ్లుగా భారత దేశం ఐక్యంగా ముందుకు పొంతుందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కొనియాడారు.రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ముందు చూపువల్లే నేడు మన దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు.అందువల్లే సమాజంలో దళిత,గిరిజన,వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేథావి,నిమ్న వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న బీఆర్.అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా సూర్యాపేటలోని ఖమ్మం చౌరస్తా,రైతు బజార్ సెంటర్ వద్ద గల ఆ మహనీయుడి విగ్రహాలకు మంత్రి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం మన అదృష్టం అనడం కంటే అది ఆయన గొప్పతనంగా అభివర్ణించారు.

అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా కులాలు,మతాలు అంటూ చిచ్చు రేపడానికి ప్రజల మధ్యకు వస్తున్న వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.అంతకు ముందు అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని,విద్యార్థులకు ప్రశంసా పత్రాలు,నగదు బహుమతులు అందించడంతో పాటు,కులాంతర వివాహాలు చేసుకుని ఆదర్శంగా నిలిచిన సూర్యాపేట జిల్లాకు చెందిన 9 మంది ఆదర్శ దంపతులకు 2లక్షల 50 వేల రూపాయల చొప్పున నగదు చెక్ లను మంత్రి అందజేశారు.

అంబేద్కర్ ఆశయలకనుగుణంగా సీఎం పథకాలు

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంబేద్కర్ స్పూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారన్నారని,అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాలన నేడు దేశానికి దిక్సూచి అవుతుందన్నారు.విద్యతోనే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆశయం మేరకు రాష్ట్రంలో 125కి పైగా గురుకుల విద్యాలయాలు ప్రకటించి,ఈ ఏడేళ్ల లో 978 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయడం విద్యకు మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు.

విద్యతోని మాత్రమే దళితులను సమాజంలో ముందుకు తీసుకువెళ్లలేమని,ఆర్థికంగా పరిపుష్టి చేయడం కూడా అవసరమని గుర్తించిన కేసీఆర్ ఆలోచనల నుండి పుట్టిన పథకమే దళితబంధు పథకమన్నారు.దళిత బంధు లబ్దిదారుల కళ్ళలో కనిపిస్తున్న ఆనందం తనకు ప్రజా ప్రతినిధిగా సంతృప్తి నిస్తుందన్నారు.

అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్

దళితులు,గిరిజనులు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశ్యంతో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పేరిట విదేశాల్లో చదివే వారికి 20 లక్షల రూపాయల స్కాలర్ షిప్ అందిస్తున్న గొప్ప అంబేద్కర్ వాది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.చదువుకున్న తర్వాత స్వయం ఉపాధికి శిక్షణ ఇస్తూ,పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు దేశంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకం కింద 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తూ వారికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో శిక్షణ ఇప్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని అన్నారు.

ఎస్సీ,ఎస్టీ ప్రగతి ప్రత్యేక నిధి చట్టం

దళితులు,గిరిజనులకు కేటాయించిన నిధులు వారికే ఖర్చు కావాలని ఎస్సీ,ఎస్టీ ప్రగతి ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని తీసుకొచ్చి, జనాభాకనుగుణంగా నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని అన్నారు.ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన నిధులు ఖర్చు చేయలేకపోతే మరుసటి సంవత్సరానికి ఆ నిధులు బదిలీ అయ్యే విధంగా చట్టం చేసి వారి నిజమైన ప్రగతికి సిఎం పట్టం కడుతున్నారని కొనియాడారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ సమాజంలో ముందుకు నడవాలని తెలిపారు.

సిఎం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కల్పించిన పథకాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చేవిధంగా ఎదగడమే అంబేద్కర్ కి మనం ఇచ్చే నిజమైన నివాళిగా మంత్రి జగదీశ్ రెడ్డి అభివర్ణించారు.

ఇప్పటికే దళిత సాధికారత కోసం ఎన్నో సంక్షేమ పధకాలు తెచ్చిన సీఎం,కాంట్రాక్టులు, మద్యం షాప్ టెండర్లలో రిజర్వేషన్లు కేటాయించి దళిత బంధువుగా నిలిచారాన్నారు.రాబోవు రోజుల్లో యువత అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా నడచుకోవడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అవలంభిస్తున్న అహింసా విధానాలను అలవాటు చేసుకోవాలని,సన్మార్గంలో నడిచినప్పుడే మంచి అవకాశాలు అందుకోగలుగుతారని,అందుకు అంబేడ్కర్ చూపించిన మార్గం ఎంతో విలువైందని మంత్రి స్పష్టం చేసారు.

కాబట్టి నేటి యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసువాల్సిన అవసరం ఉందని ఉద్భోదించారు.ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపికా యుగంధర్ రావ్,వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ,గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్,వైస్ ఛైర్మన్ పుట్టా కిషోర్,జడ్పిటిసి జీడీ భిక్షం,పెన్ పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube