ప్రస్తుత రోజుల్లో అది తింటే ఆ రోగం వస్తుందని, ఇది తింటే ఈ రోగం వస్తుందని అని పెద్దలు చెప్తూ ఉంటారు.ఇలా ప్రతి పదార్థం తీసుకోవడం వల్ల ఏదో ఒక రోగం వస్తుంది అని అంటూ ఉంటారు.
ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా పంచదార తీసుకుంటే అనేక సమస్యలు వస్తాయని చాలా వరకు బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు చాలామంది.ముఖ్యంగా మధుమేహం సమస్యతో బాధపడేవారు ఇందులో ఎక్కువగా ఉన్నారు.
ఇది ఇలా ఉండగా చివరికి బెల్లంని కూడా కల్తీ చేయడం మొదలు పెట్టేశారు అంటే నమ్మండి.కాబట్టి బెల్లం తీసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు నిపుణులు.
బెల్లాన్ని కల్తీ చేయాలనుకునేవారు కాల్షియం కార్బోనేట్, సోడియం బైకార్బొనేట్ లాంటి రసాయనాలను కలుపుతూ ఉంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలా ఎందుకు చేస్తున్నారో అన్న విషయానికి వస్తే బెల్లం బరువు ఎక్కువ అయ్యేందుకు కాల్షియం కార్బోనేట్ ను, అలాగే బెల్లం మంచి రంగు వచ్చేందుకు, సోడియం బైకార్బొనేట్ ను కలుపుతున్నట్లు తెలుస్తుంది.
ఇలా రసాయనాలు కలపడంతో 24 గంటల్లోనే అది ఎరుపు, తెలుపు, పసుపు రంగులోకి మారిపోతుంది అని అంటున్నారు నిపుణులు.

ఇక ఏ రంగులో ఉండే బెల్లంని ఉపయోగించాలో అంటూ వైద్యులు సూచిస్తున్నారు.ఇక ఎలాంటి బెల్లం కొనాలన్న విషయానికి వస్తే.ముదురు గోధుమ రంగులో ఉండే మాత్రమే కొనుక్కోవడం మంచిది అని అంటున్నారు.
ఇందుకు ముఖ్య కారణం ఏమిటి అంటే అది ఒరిజినల్ బెల్లం, అలాగే బెల్లం చెరుకు తో తయారు చేస్తారు.ఇలా తయారు చేసే తరుణంలో చెరుకు వేడికి బాగా మరిగి ముదురు ఎరుపు రంగు లోకి వస్తాయి.
ఇలా ముదురు ఎరుపు రంగులోకి మారిన బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటున్నారు నిపుణులు.మన తీసుకునే బెల్లం స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవాలంటే కొంచెం బెల్లాన్ని నీటిలో వేయాలి.
ఇలా చేయడం వల్ల ఒకవేళ బెల్లం కల్తీ అయినది అయితే ఆ కలిపిన పదార్థాలు నీటి అడుగు విభాగంలోకి వెళ్లిపోతాయి అని అంటున్నారు నిపుణులు.