నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గు రవాణా చేసేందుకు ఏర్పాటు చేసిన రైల్యే ట్రాక్ కు రైతుల నుండి భూములు తీసుకొని,వారికి ఏడాది కాలంగా నష్టపరిహారం చెల్లించకుండా నర్సాపురం వద్ద రైల్వే నిర్మాణ పనులు ఎట్ల చేస్తుండ్రని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అధికారులను ప్రశ్నించారు.మంగళవారం దామరచర్ల మండలం నర్సాపురం వెళ్లి రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆర్డీవో ఆఫీస్ కు రైతులతో చేరుకొని ఆర్డీవోతో రైతు సమస్యలపై చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ట్రాక్ లో నష్టపోయినా రైతుల పరిహారం విషయంలో ఏడాది కాలంగా గెజిటె నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు.
రైతుల ఆవేదనను ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదని అవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి భూములు కోల్పోయిన చిన్న,సన్న కారు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పాపా నాయక్,రైతులు బాలు,వినోద్,రఘు,శివ, శ్రీను,మేశ్య తదితరులు పాల్గొన్నారు.