సూర్యాపేట జిల్లా: వైఎస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి అన్నారు.ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఏపూరి సోమన్న అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ వైఎస్ షర్మిల రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పాదయాత్ర చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారని చెప్పారు.
ప్రతి గ్రామంలో దివంగత నేత వైఎస్ఆర్ చేసిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల మదిలో ఉన్నాయని,ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు,ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు చేసి ప్రజలకు మేలు చేశారని చెప్పారు.వైఎస్సార్ బిడ్డగా షర్మిల 3800 కిలోమీటర్లు 200 రోజులు పాదయాత్ర చేస్తూ కేసీఆర్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను బయటపెడుతున్నారని చెప్పారు.
తట్టుకోలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వైయస్ షర్మిల పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేక అడుగున అడ్డంకులు కల్పిస్తున్నారని చెప్పారు.గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీల ద్వారా పార్టీ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి కృషి చేయాలని చెప్పారు.ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న మాట్లాడుతూ స్థానికులకు అవకాశం కల్పించినట్లయితే ప్రజా సమస్యలపైన నిలదీసి నిగ్గదీసి సాధిస్తారని చెప్పారు.
తుంగతుర్తి నియోజకవర్గంలోని మాదిగ,మాల సామాజిక వర్గాలు ఆలోచించి స్థానికునికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు,మహిళా విభాగం రాష్ట్ర నాయకులు కనిత,నల్గొండ జిల్లా అధ్యక్షులు పెండేo నర్సిరెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అతహర్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, వివిధ నియోజకవర్గాల ఇన్చార్జులు,మండల నాయకులు,ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు
.