ఒక ఆహారపదార్ధం ఎంతమంచిదైనా కావచ్చు, కాని అది ప్రతి మనిషికి పడాలని లేదు.మంచి ఆహారపదార్థాలు కూడా మన వయసు, ఆరోగ్యాన్ని బట్టి తీసుకోవడం, తీసుకోకపోవడం చేయాలి.
రోజుకి రెండు కప్పుల కాఫీ మంచిదే కావచ్చు, కాని అదే కాఫీని గర్భిణి స్త్రీలు తాగకపోవడమే మంచిది.అప్పటి ఆరోగ్యస్థితి అలాంటిది అన్నమాట.
ఆవుపాలలో ఎన్ని పోషక గుణాలు ఉంటాయి? ఎంత రుచి ఉంటుంది.ఆవుపాల వలన హాని ఉంటుందా, ఉండే అవకాశం ఉంటుందా? మన వయసు వారికి, మన కన్నా పెద్ద వారికి, టీనేజర్ వారికి, చిన్న పిల్లలకి కూడా ఆవు పాలు మంచివే కావచ్చు, కాని పసిపిల్లలకు ఆవుపాలు మంచివి కావు అంటున్నారు పరిశోధకులు.ముఖ్యంగా ఏడాదిలోపు పసిపిల్లకు ఆవుపాలను పట్టవద్దు అని హెచ్చరిస్తున్నారు.ఎందుకు ఇలా? చదివి తెలుసుకోండి.
ఏడాదిలోపు పసివారికి తల్లిపాలు పట్టడమే అన్ని విధాలా శ్రేయస్కరం.కాని బిజీగా ఉండే తల్లులు వేరే మార్గాలతో పిల్లలకి పాలుపడుతుంటారు.
కొందరు ఆవుపాలను పడుతూ ఉంటారు.కాని ఇది మంచి పని కాదు అంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు.
ఏడాదిలోపు పసివారికి ఆవుపాలను పట్టడం అంటే రకరకాల ఎలర్జీలకు ఛాన్స్ ఇవ్వడమే అంట.కొన్నిసార్లు ఆవుపాలు పసివారి ఊపిరితిత్తులలో, జీర్నవ్యవస్థలో సమస్యలు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
అంత చిన్న వయసులో ఆవుపాలు పట్టి ఎలాంటి లాభం ఉండదు.ఎందుకంటే అంత ప్రోటీన్ ని పసిదేహం తీసుకోలేదు.అలాగే ఆవుపాలలో ఐరన్ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి, పసివారి శరీరంలో రక్తం తక్కువగా పుడుతుంది.దీనిమీద డాక్టర్ నందన్ జోషి మాట్లాడుతూ “ఆవుపాలు తాగడం ఓరకంగా చెప్పాలంటే మన సంప్రదాయంలో భాగం.
ఆవుపాలు మనిషి శరీరానికి లాభాలే తప్ప, ఎలాంటి నష్టం చేయవు అని నమ్ముతారు.మతప్రభావం వలన అలా అనుకుంటారేమో.కాని పసిశారీరానికి ఆవుపాలు మంచివి కావు.ఆవుపాలు వారి శరీరంలో సరిగా జీర్ణం కూడా కావు.
పసివారి కిడ్నీలు ఆవుపాలను భరించలేవు.చాలా ప్రెషర్ పడుతుంది.
పిల్లలో మిల్క్ ఎలర్జీ ఉంటుంది.వారికి తల్లి పాలు ఇవ్వడమే మంచిది.
అలా వీలు కాకపోతే న్యూట్రిషన్ నిపుణులని అడిగి మరో మార్గం ఆలోచించండి కాని ఆవుపాలను మాత్రం పట్టవద్దు.ఆవుపాలు పిల్లలకు పట్టడడం వలన మరో ఇబ్బంది ఏమిటంటే, పసివారికి బైలు పెడుతుంది.
దాంతో చాలా ఇబ్బందిపడతారు.పసి శరీరాలకి అంత టార్చర్ అవసరమా” ? అంటూ ఒక న్యూట్రిషన్ సమ్మిట్ లో చెప్పుకొచ్చారు.
ఇంతమాత్రమే కాదండోయ్, ఆవుపాలని పసివారికి పట్టడం వలన స్కిన్ రాషేస్ వస్తాయి.విరేచనాలు, వాంతులు, ఎజిమా, శ్వాస సంబంధిత సమస్యలు, రోగనిరోధకశక్తి సంబధిత సమస్యలు కూడా వస్తాయి.ఈ టాపిక్ మీద, ఆవుపాలతో పసివారికి వచ్చే సమస్యల మీద Rapid Survey on Children (RSOC) మీద ఓ పెద్ద రిపోర్ట్ ని కూడా సపోర్ట్ చేసింది.జైపూర్ కి చెందిన ప్రముఖ గర్భనిపుణులు లలిత్ భారడియా కూడా ఈ సమ్మిట్ లో పాల్గొని ఆవుపాలని పిల్లలకు పట్టవద్దని తల్లులని హెచ్చరించారు.