నామినేషన్ల సందర్భంగా పోలీసు బందోబస్తు వివరాలు

సూర్యాపేట జిల్లా:అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ వేసే అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( Rahul Hegde ) అన్నారు.100 మీటర్ల పరిధిలోకి ఎవ్వరూ రాకుండా పూర్తి బారికేడింగ్ తో పోలీస్ నోడల్ ఆఫీసర్ల అధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పోలీస్ నోడల్ అధికారులు వివరాలను వెల్లడించారుహుజూర్ నగర్ అసెంబ్లీ( Huzurnagar Assembly constituenc ) సెగ్మెంట్ కి జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు,సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ కి డిఎస్పీ నాగభూషణం,కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్ కి డిఎస్పీ ప్రకాష్ జాదవ్( Prakash jadhav ),తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి డిఎస్పీ రవి పోలీస్ నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారాన్నారు.100 మీటర్ల పరిధిలో ఇతరులకు,ర్యాలీలకు, వాహనాలకు అనుమతి లేదని,ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలన్నారు.

 Details Of Police Deployment During Nominations , Suryapet District , District S-TeluguStop.com

నామినేషన్ ( Nomination )వేసే అభ్యర్థి తరపున 4 గురు వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని,సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తామన్నారు.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్ కేంద్రం రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఇద్దరు సీఐలు,ఆరుగురు ఎస్ఐలు,రెండు సెక్షన్ల పారామిలటరీ బలగాల సిబ్బంది సహా 50 మంది సిబ్బందికి పైగా బందోబస్తు విధులు నిర్వర్తిస్తారన్నారు.

ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నోడల్ అధికారులు బందోబస్తు విధులు నిర్వర్తించాలని,100 మీటర్ల పరిధిలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube