సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ లింగగిరి క్రాస్ రోడ్డు నందు బైక్ పై ప్రయాణించేవారికి హెల్మెట్ ధరించకుంటే జరిగే ప్రమాదల గురించి శుక్రవారం సిఐ రామలింగారెడ్డి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని,రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రాత్రి వేలల్లో ప్రయాణించేటప్పుడు గేదెలు రోడ్ల మీద తిరుగుండటంతో రోడ్ల మీద ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని,వాటిని ఢీకొని ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్ రెడ్డి,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.