సూర్యాపేట జిల్లా: ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన,వయోపరిమితి పెంచడం,స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల సూర్యాపేటలో అంబరాన్నంటిన సంబురాలు.టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్,మంత్రి జగదీష్ రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు.
అనంతరం బాణసంచా పేల్చి,స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో కల్లెట్లపళ్లి శోభన్, ముదిరెడ్డి అనిల్ రెడ్డి,రమ,కిరణ్,రఫీ,చెన్ను శ్రీనివాస్ రెడ్డి,బాల్మీకి సంజయ్,విజయ్,పన్ను,ప్రవీణ్,నూకల శ్రీను,దేశగాని శ్రీను,బాలమల్లు రవి యాదవ్,మహేష్, ప్రశాంత్,నాగరాజు,మురళి,తదితరులు పాల్గొన్నారు.