సూర్యాపేట జిల్లా: పాలకవీడు మండలం బొత్తలపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజా పాలకార్యక్రమాన్నిసిపిఎం మండల పార్టీ కార్యదర్శి కందకట్ల అనంత్ ప్రకాష్ ఆధ్వర్యంలో శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా మిర్యాలగూడ నుండి గుండెబోయినగూడెంకుఆర్టీసి బస్సు పునరుద్ధరించాలనతహశీల్దార్ శ్రీదేవికి ( Sridevi )వినతిపత్రం సమర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్ల క్రితం మిర్యాలగూడ డిపో నుండి సూర్యాపేట డిపో నుండి బొత్తలపాలెం మీదుగా గుండెబోయిన గూడెం వరకు బస్సు సౌకర్యం ఉండేదని గుర్తు చేశారు.ఆదాయం రావడంలేదని బస్సు సౌకర్యాన్ని నిలిపివేశారని ఫలితంగా పదేళ్లుగా ప్రజలు, విద్యార్థులు,వ్యాపారస్తులతీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారన్నారు.
నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం మహాలక్ష్మి పేర మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం హర్షనీయమని,కానీ, గ్రామీణ ప్రజలు ముఖ్యంగా మహిళలు మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాలకు బస్సును నడపాలని కోరారు.ప్రధానంగా బొత్తలపాలెం మీదుగా గుండెబోయిన గూడెం వరకు బస్సును మూడు ట్రిప్పులు వేయాలని,సూర్యాపేట జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం జిల్లా ఆఫీసులకు ప్రజలు వెళ్తుంటారని వారి సౌకర్యార్థం సూర్యాపేట నుండి దర్గా వరకు మరియు బొత్తలపాలెం పాలెం మీదుగా గుండెబోయినగూడెం వరకు బస్సు సౌకర్యం కల్పించి మహాలక్ష్మి పథకాన్ని( Mahalakshmi scheme ) మహిళలు సద్వినియోగం చేసుకునే విధంగా రవాణా సౌకర్యం కల్పించే విధంగా బస్సును నడపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వడ్డే సైదయ్య,కందకట్ల భానుమతి,వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్ రావు,( MPP Pinnelli Upender Rao ) అందే రాజు,మహిళలు పాల్గొన్నారు
.






