సూర్యాపేట జిల్లా:మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన సీపీఎం మండల కార్యదర్శి వట్టేపు సైదులు కుమారుడు సుజిత్ మంగళవారం కనిపించకుండాపోయాడు.ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలలో మార్కులు తక్కువ రావడంతో మనస్తాపానికి గురైన బాలుడు కోదాడ బస్టాండ్ లో బాత్రూమ్ కి వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళి మళ్ళీ రాలేదు.
దీనితో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.బాలుడి ఆచూకి తెలిసినవారు 9866373019 ఫోన్ నంబర్ సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.వట్టేపు సైదులు స్వగ్రామం మునగాల మండలం కొక్కిరేణి గ్రామం.