ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నిర్వహించిన చాకలి ఐలమ్మ 128వ జయం( Chakali Ilamma )తి వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ ఐలమ్మ సాహసమే తెలంగాణ సమాజానికి స్పూర్తి అన్నారు.

 Celebrating 128th Birth Anniversary Of Chakali Ilamma, Jagadish Reddy , Kcr ,-TeluguStop.com

సాయుధ పోరాటంలో ఆమె చూపించిన తెగువ ప్రపంచంలోనే తెలంగాణకు గుర్తింపు తెచ్చిందని కొనియాడారు.ఐలమ్మ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతుందని,ఆ యోధురాలి స్పూర్తితో సాగుతున్న కేసీఆర్ పాలన ద్వారా అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలో తెలంగాణను నంబర్ వన్ గా నిలబెట్టాయని అన్నారు.

జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యలో ఐలమ్మ పోరాట స్ఫూర్తితో అధిగమించాలన్నారు.

కేసీఆర్‌( kcr ) హయాంలోనే తెలంగాణ పోరాటయోధులకు సముచిత గౌరవం లభించిందని,ఐలమ్మ ఆశయాలను నెరవేర్చడమే ఆమెకు మనమంతా ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube