సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు భరోసా కింద ఖరీఫ్ సీజన్లో మొదటి విడత రూ.7500 రైతుల ఖాతాలో జమ చేయాలని సిపిఎం పెన్ పహాడ్ మండల కార్యదర్శి రణపంగ కృష్ణ విజ్ఞప్తి చేశారు.సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్న విధివిధానాల పేరిట రైతుల ఖాతాలో జమ చేయాల్సిన రైతు భరోసా డబ్బులను జాప్యం చేయడం అన్యాయమని అన్నారు.10 ఎకరాల లోపు రైతులందరికీ రైతు భరోసా అమలు చేయాలని,అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లు వివిధ ప్రజా ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వారికి రైతు భరోసా వర్తింప చేయొద్దని కోరారు.అంతే కాకుండా రుణమాఫీ విషయంలో 2018 కంటే ముందు అప్పు తీసుకున్న రైతులు రెన్యువల్ చేయించుకున్న వారందరికీ రుణమాఫీ వర్తింప జేయాలని డిమాండ్ చేశారు.ఖరీఫ్ సీజన్ మొదలైందిన విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటుగా వెంటనే రైతు భరోసా డబ్బులు రైతు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
Latest Suryapet News