యుక్త వయసు ప్రారంభం అయినప్పటి నుంచి మనతో సావాసం చేసే వాటిలో మొటిమలు( Acne ) ఒకటి.సమయం సందర్భం లేకుండా వచ్చి ఇబ్బంది పెట్టడంలో మొటిమలు ముందు వరుసలో ఉంటాయి.
అయితే కొందరికి మొటిమలు పోయిన కూడా వాటి తాలూకు మచ్చలు మాత్రం చర్మం పై అలాగే ఉండిపోతాయి.వీటి కారణంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తుంటుంది.
ఈ క్రమంలోనే మొటిమల తాలూకు మచ్చలను వదిలించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే బీట్ రూట్ మరియు పెరుగు అందుకు చాలా బాగా సహాయ పడతాయి.
ఆరోగ్యపరంగా ఇవి రెండూ ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తాయో మనందరికీ తెలుసు.
అయితే బీట్ రూట్ మరియు పెరుగు( Curd )లో ఎన్నో స్కిన్ కేర్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి.ముఖ్యంగా ఇవి రెండు ఉంటే మొటిమల తాలూకు మచ్చలను తరిమి తరిమి కొట్టవచ్చు.అందుకోసం ముందుగా ఒక చిన్న బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి.అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బీట్ రూట్ జ్యూస్( Beet root juice ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి.ప్రధానంగా బీట్ రూట్ మరియు పెరుగులో ఉండే పలు సుగుణాలు మొటిమలను, మొటిమల తాలూకు మచ్చలను క్రమంగా వదిలిస్తాయి.
మచ్చలేని చర్మాన్ని అందిస్తాయి.అలాగే బీట్ రూట్‌లోని విటమిన్లు మరియు ఖనిజాలు కొల్లాజెన్ సంశ్లేషణను ప్రేరేపిస్తాయి.
చర్మపై గీతలు మరియు ముడుతలను తగ్గిస్తాయి.బీట్‌రూట్‌లోని డిటాక్సిఫైయింగ్ లక్షణాలు చర్మం నుండి టాక్సిన్స్‌ను తొలగించి, స్పష్టమైన ఛాయను ప్రోత్సహిస్తాయి.
మరియు బ్రేక్ అవుట్‌లను నివారిస్తాయి.ఇక పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది.
ఇది మీ చర్మ రంధ్రాల లోపల కూర్చున్న మృత చర్మ కణాలు, మలినాలను, ధూళిని తొలగిస్తుంది.చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.