సూర్యాపేట జిల్లా: జిల్లాలో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదు అవుతుంది.భానుడి ప్రతాపానికి ప్రజలు, వృద్ధులు,చిన్నారులు అల్లాడిపోతున్నారు.ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లిలో 45.0 డిగ్రీలు,గరేడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.దీనితో హుజూర్ నగర్ నియోజకవర్గం డేంజర్ జోన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా జిల్లాల్లో చివ్వెంల 43.2 ,పెన్ పహాడ్ 43.1,సూర్యాపేట 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మద్దిరాలలో అత్యల్పంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఉదయం 8 గంటల నుండే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రోడ్ల మీదికి ప్రజలు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు.