సూర్యాపేట జిల్లా:నిత్యం బందోబస్తులు,శాంతిభద్రతల పరిరక్షణలో బిజీగా ఉంటున్న జిల్లా పోలీసు సిబ్బందిలో ఉత్సాహం నింపడంలో భాగంగా,మానసిక వత్తిడికి లోనయ్యే పోలీసులు,వత్తిడి లేకుండా పని చేయాలని,ఆటవిడుపు కోసం జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పోలీస్ ఫ్రెండ్లి క్రికెట్ టోర్నీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడు బిజీగా విధులు నిర్వర్తిస్తున్నారు, జాతర బందోబస్తులు,ప్రజారక్షణ,వాహనాల తనిఖీలు, వి.
ఐ.పి బందోబస్తు,పిర్యాదుల నిర్వహణ, పెట్రోలింగ్ ఇలా నిత్యం పనిలో ఉండి వత్తిడికి లోనవుతున్నారని,ఆటవిడుపుగా ఈ ఫ్రెండ్లీ టోర్నీ నిర్వహించామని అన్నారు.సిబ్బంది వత్తిడి లేకుండా పని చేసినప్పుడే ఆరోగ్యంగా ఉంటారన్నారు.హెడ్ క్వార్టర్ టీమ్,సూర్యాపేట సబ్ డివిజన్ టీమ్, కోదాడ సబ్ డివిజన్ టీమ్ ఇలా మూడు టీమ్స్ టోర్నీలో పాల్గొన్నాయి, గెలుపొందిన హెడ్ క్వార్టర్ సిబ్బందికి బహుమతులు అందించారు.
ఈ క్రికెట్ టోర్నీలో కోదాడ DSP లు రఘు, మోహన్ కుమార్, CI లు శ్రీనివాస్, ఆంజనేయులు, రాజేష్, నాగార్జున, రామలింగరెడ్డి, మునగాల CI ఆంజనేయులు, PND ప్రసాద్, నర్సింహారావు, RI లు గోవిందరావు, నర్సింహారావు, SI లు, సిబ్బంది పాల్గొన్నారు.