దొంగనోట్ల గాదరి కిషోర్ నాలుక జాగ్రత్త:డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్

సూర్యాపేట జిల్లా:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగనోట్ల గాదరి కిషోర్ నాలుక అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

 Dcc President Cheviti Venkanna Yadav Comments On Gadari Kishore, Cheviti Venkan-TeluguStop.com

టీస్పీఎస్స ప్రశ్నాపత్రాలు లీకై నిరుద్యోగులు అల్లాడుతుంటే స్పందించే దమ్ములేని ఎమ్మెల్యే గాదరి కిషోర్,ప్రజల తరఫున కొట్లాడుతున్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నవా అంటూ మండిపడ్డారు.నీ ఇసుక దందాలు,కాంట్రాక్టుల కమిషన్ దందాలు,మీ పార్టీ లిక్కర్ స్కాంలను తెలంగాణ సమాజం గమనిస్తుందని,త్వరలో నీకు తుంగతుర్తి ప్రజలు సున్నం బొట్లు పెట్టి ఊరేగించడం ఖాయమని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube