సూర్యాపేట జిల్లా: ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేయడం లక్ష్యమని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే,ఎన్టీఆర్ కృష్ణా జిల్లా రూరల్ డిజిపి శ్రీనివాసరావు అన్నారు.తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కోదాడ మండలం రామాపురం ఎక్స్ రోడ్డు మరియు గరికపాడు వద్ద గల పోలీస్ చెక్ పోస్టులను శుక్రవారం పరిశీలించారు.
వాహనాల తనిఖీలు,అక్రమ రవాణాపై రాష్ట్రాల సరిహద్దు సమాచారాన్ని చేరవేసుకోవడం లాంటి అంశాలపై సరిహద్దు జిల్లాల ఎస్పీలు సమీక్షించి పలు సూచనలు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ నగదు తరలింపు,మద్యం తరలింపు, అసాంఘిక కార్యక్రమాలు మొదలగు వాటిపై ఇరు రాష్ట్రాల సరిహద్దు అధికారులు నిఘా ఉంచి అప్రమత్తంగా ఉండాలన్నారు.రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు తీసుకువెళ్తే సంబంధిత డాక్యుమెంట్లను చూపించాలని,ఎక్కువ మొత్తంలో ఆభరణాలు, దుస్తులు,ఎలక్ట్రానిక్ పరికరాలను రవాణా చేస్తున్న ఆధారాలను పరిశీలించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, నందిగామ ఏసిపి రవికిరణ్, కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, జగ్గయ్యపేట ఇన్స్పెక్టర్ జానకిరాములు,కోదాడ ఎస్సై అనిల్ రెడ్డి,ఇరు రాష్ట్రాల సరిహద్దు మండలాల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.