సూర్యాపేట జిల్లా:సుమారు 400 ఏండ్ల చరిత్ర కలిగి,ఎంతో ప్రసిద్ధిగాంచి,భక్తుల( Devotees ) నిత్య పూజలతో విరాజిల్లి ఓ వెలుగు వెలిగిన పురాతన దర్గా నేడు పట్టించుకునే వారులేక అసాంఘిక కార్యకలాపాలు అడ్డాగా మారిందని,ఇలాగే వదిలేస్తే కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.వివరాల్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుండ్లపహాడ్( Gundlapahad ) గ్రామంలో కొలువై ఉన్న సయ్యద్ ముస్తాఫా ఖాదరి దర్గా యొక్క చారిత్రక నేపథ్యంనేడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని,దీనితో దర్గా ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన జాన్ పహాడ్ ద( Jan Pahad Dargah )ర్గా కంటే ముందు గుండ్లపహాడ్ సయ్యద్ ముస్తాఫా ఖాదరి దర్గానే ఉండేదని, ఆరోజుల్లో ఈ ప్రాంతం దట్టమైన అడవి కావడంతో తాగేందుకు నీళ్లు దొరికేవి కావని, అప్పట్లో ఓ నిర్వాహక కుటుంబం ఈ దర్గా ఆలనాపాలన చూసుకునేదని,దర్గా( Dargah)లో పూజలు జరిగేవని భక్తులు చెబుతున్నారు.ఇంత పురాతనమైన దర్గాఫై ఇప్పటికీ భక్తుల నమ్మకం చదరలేదని, నేటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు ఈ దర్గాని దర్శించుకుంటారని అంటున్నారు.
దర్గాపై అధికారుల పర్యవేక్షణ లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటుందని,సయ్యద్ ముస్తాఫా ఖాదరి దర్గా తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డ్ గెజిట్లో ఉన్నా అధికారులు ఈ దర్గాపై దృష్టి సారించకపోవడంతో 400 ఏండ్ల చరిత్రకు,భక్తుల నమ్మకానికి చీకట్లు అలుముకుంటున్నాయని వాపోతున్నారు.దాతల, స్థానికుల సహకారంతో వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు ఉండేలా తమకు తోచినంత సమర్పించుకొని చిన్న చిన్న పనులు చేయిస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దర్గా అభివృద్ధిపై దృష్టి సాధించి పరిసర ప్రాంతాల్లో మందు బాబుల సిట్టింగ్, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు,స్థానికులు వేడుకుంటున్నారు.