సైరన్లతో హోరెత్తుతున్న కోదాడ పట్టణం...!

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణం సైరన్ హారన్ లతో నిత్యం హోరెత్తిపోతుందని పట్టణ ప్రజలు వాపోతున్నారు.నిత్యం రద్దీగా ఉండే కోదాడ పట్టణంలో ఒకవైపు 108 అంబులెన్స్,ప్రైవేట్ హాస్పిటల్స్ అంబులెన్స్ సైరన్లు,మరోవైపు డీఎస్పీ, పట్టణ సిఐ,పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ,పట్టణ ఎస్ఐ, రూరల్ సిఐ,రూరల్ ఎస్ఐ వంటి పోలీసు వాహనాల సైరన్లు,ఇంకోవైపు ఎమ్మెల్యే వాహన శ్రేణిలో ఉండే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వాహన సైరన్లతో మోత మోతమోగిస్తారు.

 Kodada Town Roaring With Sirens , Kodada, Ambulances,-TeluguStop.com

దీనితో ధ్వని కాలుష్యంతో పాటు, సైరన్ల మోతతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.ఇది చాలదన్నట్లుగా కోదాడలో కొన్ని ప్రైవేటు వాహనాలు కూడా పోలీస్ సైరన్ పెట్టి విచ్చలవిడిగా తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ సైరన్ వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.

అంబులెన్సులు( Ambulances ),పోలీసు వాహనాలు,ప్రైవేట్ వాహనాలకు ఓకే రకమైన సైరన్లు ఉండడంతో అప్పుడప్పుడు ప్రాణపాయ స్థితిలో పేషంట్లను తీసుకెళ్లే ఎమర్జెన్సీ అంబులెన్స్ లకు కూడా ఇబ్బందిగా మారుతుంది.ప్రైవేట్ వాహనాలకు పోలీస్ సైరన్ అనుమతి లేకున్నా ఎలా తిరుగుతున్నారనేది అర్దం కాని విషయం.

ఈ సైరన్ హారన్ల గోల నుండి పట్టణ ప్రజలకు విముక్తి కలగాలంటే రాష్ట్ర డిజిపి ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకొని సొంత పనులకు వెళ్లేటప్పుడు,అంబులెన్స్ పేషెంట్ ను దింపి తిరిగి వెళ్ళేటప్పుడు సైరన్ వేయకుండా చూడాలని, అలాగే అంబులెన్స్ సైరన్, పోలీస్ వాహన సైరను ఒకే రకమైన ధ్వని కాకుండా వేర్వేరు ధ్వనులతో హారన్ వచ్చేలా ఏర్పాటు చేయాలని,సైరన్ తో తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube