యూత్ స్టార్ నితిన్( Nitin ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా భీష్మ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.డైరెక్టర్ వెంకీ కుడుముల( Director Venky Kudumula ) దర్శకత్వంలో ఈ కాంబో తెరకెక్కగా సూపర్ హిట్ గా నిలిచింది.
భీష్మ సినిమా తర్వాత ఈ కాంబోపై మంచి అంచనాలు నెలకొన్నాయి.అందుకే ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రాబోతుంది అని తెలియడంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

”VNRTrio” అంటూ ఇటీవలే ఒక సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.ఛలో, భీష్మ వంటి రెండు హిట్స్ అందుకుని మూడేళ్ళ గ్యాప్ తీసుకుని వెంకీ కుడుముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అనౌన్స్ మెంట్ తోనే భారీ అంచనాలు పెరిగాయి.అయితే ఈ సినిమా గురించి తాజాగా కొన్ని రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

భీష్మ మ్యాజిక్ రిపీట్ అవుతుంది అని ఫిక్స్ అయిన ఫ్యాన్స్ కు షాక్ ఇస్తూ ఈ కాంబో నుండి రష్మిక మందన్న తప్పుకుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.దీంతో ఫ్యాన్స్ అంతా నిరాశ చెందారు.కానీ ఈ రూమర్స్ పై రష్మిక తాజాగా నెట్టింట ఒక పోస్ట్ చేసింది.ఈ పోస్ట్ తో ఈ రూమర్స్ కు చెక్ పెట్టింది.రష్మిక మందన్న( Rashmika Mandanna ) పెట్టిన పోస్ట్ ఒకటి ఆసక్తిగా మారింది.ఈమె తన నవ్వు ఆపుకుంటున్న పిక్ షేర్ చేస్తూ కొన్ని కొన్ని జనరల్ విషయాల్లో నా రియాక్షన్ ఇదే అంటూ చెప్పుకొచ్చింది.
దీంతో ఈ రూమర్స్ పై ఈమె క్లారిటీ ఇచ్చేసింది.కాగా ఈ సినిమాను జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.







