కాంగ్రెస్ కు మాదిగల ఓట్లు అడిగే హక్కు లేదు: మంద కృష్ణ మాదిగ

సూర్యాపేట జిల్లా: తెలంగాణలో మెజారిటీ శాతం ఉన్న మాదిగలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని,కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బాబూ జగ్జీవన్ రామ్ 197వ,జయంతి వేడుకలకు హాజరై,ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 Congress Has No Right To Ask Madiga Votes Manda Krishna Madiga, Congress , Madig-TeluguStop.com

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు మాదిగ పల్లెలకు వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిగల ఆగ్రహానికి గురై తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

కాంగ్రెస్ చర్యలతో మాదిగల్లో తీవ్ర నైరాశ్యం నెలకొందని,తమ వాటా హక్కులను అడిగితే మా వేళ్ళతో మా కళ్ళనే పొడిపిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికైనా ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మాదిగలకు అవకాశం ఇవ్వాలని,ప్రకటించిన స్థానాలని మార్చి రెండు పార్లమెంట్ సీట్లు సహా కంటోన్మెంట్ సీట్ మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం మాదిగలకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానిస్తే, ఇప్పటి ప్రభుత్వం పదవి ఇచ్చి విలువ లేకుండా చేసిందని,ఇటీవల జగ్జీవన్ రామ్ భవన ప్రారంభ సభ కరపత్రంలో దామోదర రాజనరసింహ పేరే లేదన్నారు.

సమాన వాటా అడిగితే తమను బీజేపీ మనుషులంటున్న జగ్గారెడ్డి మొదలు ఏ పార్టీలో ఉన్నారో గుర్తు చేసుకోవాలన్నారు.తమ ఓట్లతో నాయకుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి మాదిగలకు పట్టించుకోవడం లేదని,కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మాల కావడం వల్లే మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.

మాదిగ సోదరుడు సంపత్,సగం మాదిగైన జగ్గారెడ్డితో మాపై ఎదురు దాడి చేయిస్తున్నారని,దయచేసి కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం మాదిగ గూడాలకు రావొద్దని,వస్తే జరిగే పరిణామాలకు మీరే బాద్యులవుతారని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube