బంతి పంట నాటుకునే విధానం.. దిగుబడి పెంచే మెళుకువలు..!

పండగలు, శుభకార్యాలు వచ్చాయంటే బంతిపూలకు( Marigold Flowers ) మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.బంతిపూల సాగులో అధిక దిగుబడులు సాధించి మంచి ఆదాయం పొందాలంటే.

 Tips And Techniques For Marigold Farming,marigold Farming,marigold Flowers,agriu-TeluguStop.com

సాగు విధానంపై అవగాహన కల్పించుకోవడంతో పాటు సీజన్కు తగ్గట్టుగా ఒకేసారి కాకుండా దఫలు దఫలుగా నాటుకొని సాగు చేయాలి.వేసవి కాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి బంతిని జులై మొదటి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు నాటుకోవచ్చు.

అయితే అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు పూలను మార్కెట్ కు సరఫరా చేసే విధంగా సాగు చేపట్టాలి.అయితే వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పంట నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.

వీటిని దృష్టిలో పెట్టుకొని సాగు చేపట్టాలి.

Telugu Agriulture, Marigold, Tipstechniques-Latest News - Telugu

ఒక ఎకరాకు సరిపడే బంతి నారు( Marigold Farming ) పెంచడానికి 800 గ్రాముల విత్తనాలు అవసరం.ఎత్తైన నారుమడులు తయారు చేసుకుని విత్తనాలు విత్తాలి.మడులు తయారు చేసే ముందు ఎనిమిది కిలోల పశువుల ఎరువు ఒక చదరపు మీటరుకు వేయాలి.

విత్తడానికి ముందు ఫాలిడాల్ పొడి చల్లితే చీమల, చెదల బెడద ఉండదు.ఇక విత్తిన వారం రోజులకు విత్తనాలు మొలకెత్తుతాయి.బంతి పంట సాగు చేసే నేలలో ఒక ఎకరాకు 20 టన్నుల పశువుల ఎరువు 80 కిలోల భాస్వరం, 80 కిలోల పోటాష్, 20 కిలోల నత్రజని ఎరువులు వేసి పొలాన్ని కలియదున్నాలి.ప్రధాన పొలంలో నాటేందుకు మూడు లేదా నాలుగు హక్కులు ఉండి ఒక నెల వయసు ఉండే మొక్కలు ఎంపిక చేసుకోవాలి.

నారును సాయంకాలంలో నాటుకుంటే బాగా పాతుకుంటాయి.

Telugu Agriulture, Marigold, Tipstechniques-Latest News - Telugu

ఇక మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 40 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.బంతిపూల పంట పూత దశలో ఉన్నప్పుడు నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.నేలలోని తేమ శాతాన్ని బట్టి తరచూ పంటకు నీటి తడులు అందించాలి.

బంతి మొక్క కండపు చివరి భాగాన్ని ముందుగానే గిల్లివేస్తే అనేక పక్కకొమ్మలు వచ్చి పంట దిగుబడి పెరుగుతుంది.సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఒక ఎకరాకు ఐదు టన్నుల వరకు పూల దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube