అన్నదాతతో అమాత్యుల వారి మాటాముచ్చట

సూర్యాపేట జిల్లా:పైన కేసీఆర్ గారు ఇక్కడ మీరూ, ఎమ్మెల్యే గారు ఉన్నారు.ఆ దైర్యంతోటే దొడ్డు వడ్లు వేసినం అంటూ మంత్రి జగదీష్ రెడ్డితో రైతు సొప్పరి ఏసు మాట్లాడిన ఆసక్తికరమైన మాటా ముచ్చట మీకోసం శుక్రవారం సాయంత్రం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో స్థానిక శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ తో కలసి మహబూబాబాద్ కు వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో క్రాస్ రోడ్ వద్ద పొలుమల్లకు చెందిన రైతు సొప్పరి ఏసు పొలం నుండి వస్తుండగా మంత్రి జగదీష్ రెడ్డి తన కాన్వాయిని ఆపి అతనితో ముచ్చటించారు.

 The Ministers' Conversation With Annadatta-TeluguStop.com

ఇద్దరి నడుమ జరిగిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది.దిగుబాటు పొలాలు అయితే వరి వెయ్యాలి,చక్కగా చెలక పొలాలు పెట్టుకుని వరి ఎందుకు వేసినవు అంటూ మంత్రి జగదీష్ రెడ్డి అడిగితే పైన కేసీఆర్ ఉండు ఇక్కడ మీరు,ఎమ్మెల్యే ఉండు ఆ దైర్యంతోటే వేసినం అయ్యా అంటూ ఆ రైతు బదులిస్తుంటే అందరి మధ్య నవ్వులు కురిపించాయి.

పైన కేసీఆర్ సార్ ఉండు అందరూ ఆ దైర్యంతోటే వేస్తున్నారు కానీ,అధిక ఆదాయం వచ్చే పంటలు లాభదాయకంగా ఉంటాయి కదా అని మంత్రి చెబుతుంటే అంతే సూటిగా ఏ మాత్రం తడుముకోకుండా కూరగాయలు వేసినం అయ్యా దొండకాయలు,సొరకాయలు, కాకరకాయలు పండించినం రోజుకు 1000 నుండి 1500 సంపాదిస్తున్నాం అయ్యా అంటూ టక్కున సమాధానం చెప్పిండు.అంతే కాదు రెండు పశువులు, రెండు బర్రెలు కుడా ఉన్నాయి అయ్యా అంటూ మంత్రి జగదీష్ రెడ్డికి సదరు రైతు వివరిస్తుంటే అయితే ఓ పని చెయ్యి కూరగాయల మీద దృష్టి సారించు పశువులు ఉన్నాయి కదా అరెకరంలో చొప్ప పెట్టు సంవత్సరానికి 8 సార్లు కోసుకోవొచ్చు అంటూ రైతుకు మంత్రికి నడుమ సంభాషణ కొనసాగింది.

స్వరాష్ట్రంలో సుపరిపాలన అంటూ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అప్రతిహత విజయాలతో రెండు మార్లు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రెండెకరాల రైతు అటు వరి ఇటు కూరగాయలు పండిస్తూ ఎంతటి ఆత్మస్థైర్యంగా ఉన్నారో అని చెప్పేందుకు సదరు రైతుతో జరిగిన సంభాషణ కళ్ళకు కట్టినట్లు ఉందని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube