సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి శనివారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది.బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావుతో పాటు రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం(బాబు), మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తువరపు పాండురంగారావు, మహబూబ్ జానీ,అల్తాఫ్ హుస్సేన్,మోతె ఎంపీపీ ఆశ,అనంతగిరి ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, నడిగూడెం జడ్పిటిసి బాణాల కవిత,అనంతగిరి జడ్పిటిసి నల్లజాల ఉమా, ఎర్రారం పిఎసిఎస్ చైర్మన్ కౌన్సిలర్ గుండపునేని.
నాగేశ్వరరావు,పుల్లూరి అచ్చయ్య,లింగారెడ్డి, సత్యనారాయణ,దండా వీరభద్రం,అంబడీకర్ర శ్రీనివాసరావు,కనగాల నరసింహారావు తదితరులు ఉన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుతో విసుగు చెంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
శనివారం కోదాడలోని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2018 లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు కోదాడ అభ్యర్థిగా ఎమ్మెల్యే బొల్లం విజయం కోసం అందరం సమిష్టిగా కృషి చేశామని, గెలిచిన నాటినుండి పార్టీలో తమకు ప్రాధాన్యం లేకుండా చేసి అతనికి వ్యతిరేకంగా చేసిన వారిని చేరదీసి పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు సింగిల్ విండో చైర్మన్లు వారి విధులు వారిని చేసుకోనివ్వకుండా అడుగడుగునా అడ్డుపడుతూ ప్రజా ప్రతినిధులను అవమానపరిచారని అన్నారు.
అధిష్టానం దృష్టికి కోదాడ అభ్యర్థిని మార్చాలంటూ ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు.