మద్య నిషేధానికి మరో గ్రామం ముందుకొచ్చింది

సూర్యాపేట జిల్లా:మద్యం మహమ్మారితో ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయని గుర్తించిన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని గట్టికల్లు గ్రామంలో సంపూర్ణ మధ్యపానం నిషేధం అమలు చేయాలంటూ బెల్ట్ షాపులు నిర్వహించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం గ్రామస్తులు ఆత్మకూర్ (ఎస్) ఎస్సై వై.సైదులకు వినతిపత్రం అందజేశారు.

 Another Village Has Come Forward To Ban Alcohol , Ban Alcohol , Suryapet Distr-TeluguStop.com

గ్రామం నుండి ఆత్మకూర్ (ఎస్)పోలీస్ స్టేషన్( Atmakur (S) Police Station ) వరకు ర్యాలీగా వచ్చి గ్రామంలో మద్యనిషేధం అమలు చేసేందుకు గ్రామస్తులం ఏకగ్రీవ తీర్మానం చేశామని,అక్రమంగా ఎవరైనా మద్యం విక్రరించినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకొని గ్రామంలో మధ్యపాననిషేధ అమలుకు అధికారికంగా సహకరించాలంటూ గ్రామస్తులు ఎస్ఐని కోరారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో యువకులు బైక్ ర్యాలీ నిర్వహించి ఈనెల 14 నుండి సంపూర్ణ మధ్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నామని అందుకు అందరూ సహకరించాలని శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube