సూర్యాపేట జిల్లా:అధిక వర్షాలతో అప్రమత్తంగా ఉండండి.ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి వినతి.
అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించాలి.క్షేత్రస్థాయిలో సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.
అంటూ రోగాలు ప్రబలకుండా తక్షణ చర్యలు చేపట్టాలి.రీస్క్యూ టీంలతో విద్యుత్ శాఖా ఎలర్ట్ గా ఉండాలి.సూర్యాపేట జిల్లాలో అలుగుపోస్తున్న 359 చెరువులు.712 చెరువులలో జలకళ.మూసి నుండి పంటకాలువలకు నీటిన విడుదలకు ఆదేశాలు.-మంత్రి జగదీష్ రెడ్డి హాజరైన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,ఎస్పి రాజేంద్రప్రసాద్ నీటిపారుదల,పంచాయతీ రాజ్,ఆర్&బి,వ్యవసాయ శాఖాధికారులు.
అధిక వర్షాలు వస్తున్న నేపథ్యంలో యావత్ ప్రజానీకానికి మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.జిల్లాలోని 1071 చెరువులకు గాను తాజాగా కురుస్తున్న వర్షాలకు 359 చెరువులు అలుగు పోస్తున్నాయని ఆయన వివరించారు.
మిగిలిన 712 చెరువులకు వరద నీరు చేరి ఇప్పుడిప్పుడే అలుగు పొసే స్టేజికి చేరుకున్నాయన్నారు.గడిచిన మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా జోరుగా కురుస్తున్న వర్షాల నేపద్యంలో మంగళవారం రోజున మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
వర్షాలు మొదలైన రోజు నుండే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మకాం వేసిన మంత్రి జగదీష్ రెడ్డి పెరుగుతున్న వర్షాలకు అనుగుణంగా మూడు జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్ లో మానిటరింగ్ చేస్తున్న విషయం విదితమే.ఇదే క్రమంలో రాష్ట్ర వాతావరణ శాఖ సూర్యాపేట,నల్లగొండ,తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో హై ఎలర్ట్ ప్రకటించడంతో పాటు సోమవారం రాత్రి పొద్దు పోయాక స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డితో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం నల్లగొండ,యాదాద్రి భువనగిరి జిల్లాల అధికారులతో చరవాణిలో పరిస్థితులు అడిగి తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి,మంగళవారం ఉదయం హై ఎలర్ట్ అని భావిస్తున్న సూర్యాపేట జిల్లా అధికారులతో పరిస్థితులను సమీక్షించారు.ప్రజలను ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అన్నింటికి మించి జోరుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అంటు రోగాలు ప్రబలకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
అదే సమయంలో రీస్క్యూ టీంలతో విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారులను ఆదేశించారు.మూసికి వరద ఉదృతం ఆయిన నేపద్యంలో పంట కాలువలకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
నీటి విడుదల నేపథ్యంలో మూసి పరీవాహక ప్రాంతాన్ని అప్రమత్తం చెయ్యాలని అధికారులకు సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పి రాజేంద్రప్రసాద్ లతో పాటు నీటిపారుదల, పంచాయతీ రాజ్,రోడ్లు,భవనాలు,వ్యవసాయ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.