గణపవరం ఊర చెరువును కాపాడండి

సూర్యాపేట జిల్లా:గ్రామానికి జల వనరులను మరియు మత్స్యకారులకు జీవనోపాధిని ఇస్తున్న చెరువును కొందరు అక్రమార్కులు అక్రమంగా చెరబడుతున్నారని ఆరోపిస్తూ ఆక్రమణకు గురవుతున్న చెరువును కాపాడలంటూ మత్స్యకారులు చెరువు వద్ద ఆందోళనకు దిగిన ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం( Ganapavaram )లో వెలుగులోకి వచ్చింది.

 Save Ganapavaram Village Pond, Ganapavaram, Suryapet District, Fishermen, Kodad-TeluguStop.com

ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు ( Fishermen )మాట్లడుతూ గణపవరం గ్రామంలోని ఊర చెరువు వందల ఏళ్ల నుండి గ్రామానికి జల వనరులను అందిస్తూ, చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలకు జీవనాధారంగా ఉందన్నారు.

గత కొద్ది రోజులుగా గ్రామానికి చెందిన కొందరు ఆక్రమణదారులు చెరువును కబ్జా పెట్టే పనిలో ఉన్నారని,ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.దీనితో అక్రమార్కులు మరింత రెచ్చిపోయి,తమకు ఎదురు చెప్పేవారు లేరని చెరువును పూర్తిగా పూడ్చడం మొదలు పెట్టారని,చేసేదేమీ లేక ఊర చెరువును కాపాడుకోడానికి ఆందోళన చేపట్టామని తెలిపారు.

చెరువు మొత్తం ఆక్రమణలకు గురైతే తాము జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఊర చెరువును కబ్జాలకు గురి కాకుండా కాపాడాలని, చెరువును ఆక్రమించిన అక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube