సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ లో నాలుగు,ఐదు తరగతుల్లో ప్రవేశం కొరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాస్థాయి ఎంపిక కార్యక్రమం నిర్వహించారు.ఈ ఎంపికకు జిల్లాలోని అన్ని గ్రామాల నుండి 126 మంది బాలబాలికలలు హాజరైనారు.
హాజరైన బాలబాలికలుకు 09 మోటార్ క్వాలిటీ టెస్టులు నిర్వహించగా,
ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతి తరగతికి 10 మంది బాలురు,10 బాలికలను ఎంపిక చేసి 27-07-2023 న రాష్ట్రస్థాయిలో జరిగే ఎంపికకు పంపబడునని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్.
జి.ఎఫ్ సెక్రెటరీ అజమ్ బాబు, వ్యాయామ ఉపాధ్యాయల అధ్యక్షులు పి.మల్లేష్, జనరల్ సెక్రెటరీ ఐ.శ్రీనివాస్ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.