నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: అదనపు కలెక్టర్

సూర్యాపేట జిల్లా: జిల్లాలో ఈ నెల 20 నుండి చేపట్టే నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లోని ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆసుపత్రులు, పాఠశాలలు,కళాశాలలో 19 సంవత్సరాల లోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు అందించాలని సూచించారు.

 De-worming Program Should Be Successful Additional Collector Patil Hemanta Kesha-TeluguStop.com

నులిపురుగుల నివారణ కార్యక్రమం సంవత్సరంలో రెండు విడతల్లో చేపట్టడం జరుగుతుందని,ఈ పథకం 2016 నుండి అమలులోకి వచ్చిందన్నారు.ముఖ్యంగా జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో తప్పక అమలు చేయాలని సూచించారు.

జిల్లాలోని అనుబంధ శాఖల అధికారులు, వైద్యాధికారులు సమన్వయంతో కలసి పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.అలాగే 5 సంవత్సరాల పిల్లలకు, వివిధ కారణాలతో టీకాలు వేయించని పిల్లలకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో గుర్తించి టీకాలు వేయించాలన్నారు.

అనంతరం నిలిపురుగుల నివారణ స్టికర్ ను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో ఇంచార్జ్ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ హర్షవర్ధన్, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ నిరంజన్ రెడ్డి,డిఐఒ డాక్టర్ వెంకటరమణ,పిఓ డాక్టర్ సాహితీ,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube