అరవై ఏళ్లుగా సొంత గూడు లేని నిరుపేద ముస్లిం కుటుంబం

సూర్యాపేట జిల్లా:అరవై ఏళ్లుగా ఉండడానికి నిలువ నీడ లేక మజీద్ కాంప్లెక్స్ నందు తల దాచుకుంటున్న నిరుపేద ముస్లిం కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.ప్రభుత్వాలు,పాలకులు,అధికారులు మారినా ఆ కుటుంబం తలరాత మాత్రం మారలేదు.

 A Poor Muslim Family Without A Nest Of Their Own For Sixty Years , Poor Muslim F-TeluguStop.com

వివరాల్లోకి వెళితే…సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రానికి చెందిన ఓ పేద ముస్లిం కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో బతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన పైసలతో కడుపు నింపుకుంటుంది.పొద్దంతా పని చేసుకొని పడుకోడానికి కూడా సొంత ఇల్లులేక డివైడర్లకు ఇరువైపులా ఉన్న రోడ్లపై పడుకుంటూ చలికి వణుకుతూ అత్యంత హీనమైన జీవితాన్ని గడుపుతున్నారు.

రాత్రి సమయంలో విషసర్పాలు,కుక్కలు, దోమలతో సహజీవనం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.గత ప్రభుత్వంలో గొప్పగా ఇచ్చామని చెబుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వీరు అర్హులు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తామని చెబుతున్న ఇందిరమ్మ ఇళ్లు,ఇంటి స్థలం వీరికి కేటాయించి,వారికి సొంత గూడు ఉండేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube