పదవ తరగతి పరీక్ష కేంద్రాలను విజిట్ చేసిన అధికారులు...!

Officials Who Visited 10th Class Examination Centers...!

ఏప్రిల్ మూడో తేదీ నుంచి నిర్వహించు 10వ తరగతి పరీక్షా కేంద్రాలను హుజూర్ నగర్ మండల తహసిల్దార్ వజ్రాల జయశ్రీ,మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కట్టా వెంకటరెడ్డి సంయుక్తంగా సందర్శించి,ఏర్పాట్లను పరిశీలించారు.పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు తగిన సలహాలు సూచనలు అందజేశారు.

 Officials Who Visited 10th Class Examination Centers...!-TeluguStop.com

అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలను విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తామని తెలిపారు.అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను పరీక్షా కేంద్రాల యందు కల్పిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ లు అనిల్ కుమార్,మల్లెల ఉదయశ్రీ,శ్రీనివాసరావు, రాములు,డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు మరియు సిఆర్పి సైదులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube