ప్రతి బిడ్డకు వ్యాక్సిన్ అందాలి:డిఎంహెచ్ఓ

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్ర గ్రంధాలయంలో నిర్వహిస్తున్న జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి బిడ్డకి అందవలసిన వ్యాక్సిన్ సకాలంలో అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

 Every Child Should Be Vaccinated: Dmho-TeluguStop.com

మిషన్ ఇంద్రధనుస్సు ఈ నెల 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమంలో ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోని పిల్లలను గుర్తించి వారికి వ్యాక్సిన్ వేసేవిధంగా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ.బిచ్చు నాయక్, సూపర్వైజర్ స్వరూప కుమారి,సంధ్యారాణి,మాధవి పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube