సూర్యాపేట జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో ప్రజలపై భారాలు మోపొద్దని,పెరుగుతున్న నిత్యావసర వస్తువుల,పెట్రోలు,డీజిల్,వంటగ్యాస్ మరియు విద్యుత్,బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం,సిపిఐ,సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ,సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా, రామచంద్రన్ వర్గం,బీసీపీ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా పార్టీల సూర్యాపేట జిల్లా కార్యదర్శులు మల్లు నాగార్జునరెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు,మండారి డేవిడ్ కుమార్, కొత్తపల్లి శివకుమార్,బుద్ధా సత్యనారాయణ, చామకురి నర్సయ్యలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ధరలు విపరీతంగా పెంచుతూ పేద,మధ్య తరగతి ప్రజలపై భారాలు మోపుతుందన్నారు.
పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను సామాన్య ప్రజలు భరించలేనంతగా పెంచడం దుర్మార్గమన్నారు.వంటగ్యాస్ ధరను వేయి రూపాయలకు పైగా పెంచడం,ఉన్న సబ్సిడీ కుదించడం దారుణమని మండిపడ్డారు.
పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదల నిత్యావసర వస్తువుల ధరలపై పడి అవి కూడా విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల గురించి ఆలోచన లేకుండా సుంకాలు,పన్నుల పేరుతో ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ ప్రజల సంపదను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠ పరిచి 14 రకాల వస్తువులను ప్రభుత్వమే పంపిణీ చేయాలని సూచించారు.పెంచిన భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించాలన్నారు.
ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచే విధంగా వ్యహరిస్తూ నిధులు కోత విధించడం సరికాదన్నారు.పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని,అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,బుర్రి శ్రీరాములు, కోట గోపి,ఎలుగూరి గోవింద్,సీపీఐ జిల్లా నాయకులు పాలకురి బాబు,పోకల వెంకటేశ్వర్లు,మండవ వెంకటేశ్వర్లు,కంబాల శ్రీనివాస్,అనంతుల మల్లీశ్వరి, సీపీఐ ఎంఎల్ న్యూ డేమోక్రసీ జిల్లా నాయకులు గంట నాగయ్య,కారింగుల వెంకన్న,ఎస్కె.సయ్యద్, ప్రజపంథా జిల్లా నాయకులు ఎర్ర అఖిల్,జీవన్, వీరబాబు,సింహాద్రి సీపీఎం నాయకులు మేకనబోయిన సైదమ్మ,కొప్పుల రజిత,ఎలుగూరి జ్యోతి, జె.
నర్సింహరావు,నాగారపు పాండు,మిట్టగడుపుల ముత్యాలు,మేకనబోయిన శేఖర్, ఎం.వెంకటేశ్వరరావు,బెల్లంకొండ వెంకటేశ్వర్లు,దేవరం వెంకటరెడ్డి,పల్లా వెంకటరెడ్డి,వట్టెపు సైదులు,సీపీఐ నాయకులు యల్లవుల రమేష్,రెమిడాల రాజు, దేవరం మల్లీశ్వరి,అయిలపురం లక్ష్మీ,బూర వెంకటేశ్వర్లు,దేశగాని రవి తదితరులు పాల్గొన్నారు.