సూర్యాపేట జిల్లా:కోదాడ మండలాన్ని ఆదర్శ మండలంగా అభివృద్ధి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం కోదాడ మండలం సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యాతిధిగా పాల్గొని మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
మిషన్ భగీరథ ద్వార గ్రామాల్లో సురక్షిత త్రాగునీటి అందించడం జరుగుతుందని గుర్తు చేశారు.ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందని తెలిపారు.విద్యుత్ శాఖ అధికారులు గ్రామాలలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నాయన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పల్లెలన్నీ క్రమక్రమంగా ప్రగతి పథంలో పయనిస్తున్నాయని,గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు.స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని,గ్రామాలలో అధికారులు తిరిగి సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించాలని కోరారు.
గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామాలలో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
పనులలో అధికారులు అలసత్వం వహించ వద్దని అన్నారు.అధికారులు ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలకు అభివృద్ధి కోసం అడిగే పనులను తప్పకుండా చేయాలని అన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని,అధికారులు ప్రతి ఒక్కరూ తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని పాటించాలన్నారు.మండలానికి సంబంధించి అన్ని విధాలుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో కోదాడ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ సమావేశానికి కోదాడ ఎంపీపీ కవితా రాధారెడ్డి అధ్యక్షత వహించగా, జెడ్పీటీసీ కృష్ణకుమారి శేషు,వైస్ ఎంపీపీ రాణి బ్రహ్మయ్య,ఎంపీడీఓ,సొసైటీ చైర్మన్ లు రమేష్, నలజాల శ్రీనివాసరావు,ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు,ఎంఈఓ సలీమ్ షరీఫ్,ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.