సూర్యాపేట జిల్లా: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్( District Collector Tejas Nandalal Pawar) అన్నారు.బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో సతీసమేతంగా పాల్గొని గౌరవమ్మకు పూజలు నిర్వహించి,బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, సిబ్బందికి ముందుగా బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా ప్రజలు,సిబ్బంది ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండాలన్నారు.
బతుకమ్మ పండుగ మహిళలకి ప్రత్యేకమని,ప్రకృతిలో లభించే పూలను సేకరించి అందంగా బతుకమ్మ పేర్చి పూజిస్తారని,చిన్న పెద్దలందరూ తొమ్మిది రోజులు పాటు పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడుకుంటారన్నారు.అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ నేడు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందన్నారు.
సిబ్బందితో బతుకమ్మ ఆడటం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాడే పాటలకి మహిళా సిబ్బంది బతుకమ్మ సంబరాలు అంబారాన్ని అంటాయి.
ఈకార్యక్రమంలో పవర్ గ్రిడ్ సిఎండి అరుణ్ కుమార్,డిఆర్డీఓ పిడి వివి అప్పారావు, డిడబ్ల్యూఓ నరసింహారావు,డిటిడిఓ శంకర్,ఎస్సీ వెల్పేర్ అధికారిణి లత,బీసీ వెల్ఫేర్ అధికారిణి అనసూర్య,డిసిఓ పద్మ, పరిపాలనాధికారి సుదర్శన్ రెడ్డి, సూపరిటీడెంట్ పద్మారావు,టిఎన్జిఓ కార్యదర్శి శ్యామ్, ఉద్యోగులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
.